మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం ఆర్ఖండ్ల గ్రామ సర్పంచ్ పవన్,మండల పశువైద్యాధికారి డాక్టర్ మాధవరావు ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు.ఈ మేరకు 80 పశువులకు గర్భ నివారణ మందులు,22 దూడలకు నత్తల నివారణ మందులు,58 లేగదూడలకు ముద్దచర్మ వ్యాధి నిరోధక టీకాలు వేశామని మాధవరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయేందర్ రావు,సందీప్ కుమార్,గోపాలమిత్ర సిబ్బంది సంపత్, మొండయ్య,శ్రీనివాస్ పాల్గొన్నారు.

