పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం లో కొంపెల్లి విజయ్ అతని కొడుకు విధ్వంస్ అంగన్వాడి పాఠశాలలో చదువుకుంటున్నాడు అందులో అంగన్వాడి టీచర్ గా పనిచేస్తున్న సల్వాని రాణి చిన్నారిని చితక బాదడంతో కన్నుకు గాయమైంది.. దీంతో కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కొడుకు ని అకారణంగా ఇష్టం వచ్చినట్లు కొట్టిన అంగన్వాడీ టీచర్ పై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

