Breaking News

జుజ్జులరావుపేటలో “మనప్రగతి” జాతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరన

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జుజ్జులరావుపేట గ్రామపంచాయతీ నందు గ్రామ సెక్రెటరీ రవిశంకర్, గ్రామ సర్పంచి దాట్ల సతీష్ (సలీం), జిల్లా కాంగ్రెస్ నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి ఈ ప్రముఖుల చేతుల మీదుగా మన ప్రగతి న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో పొన్నం ఉపేందర్ నాయుడు ఆవిష్కరింప చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే సీనియర్ జర్నలిస్టు మా గ్రామంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాము. గ్రామాభివృద్ధికి ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ఏ సమస్య గురించి తెలియజేసిన మాతో సహకరించి మన గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు. మన ప్రగతి జాతీయ దినపత్రిక క్యాలెండర్ ని ఆవిష్కరించిన ప్రముఖులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో పొన్నం ఉపేందర్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు.

అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు