•జిల్లా ఎస్పి డాక్టర్ శబరిష్.
మన ప్రగతి న్యూస్/కేసముద్రం:
ఓట్ల లెక్కింపు సందర్భంగా 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కార్డులు ఉన్న వారికే లెక్కింపు కేంద్రంలో ప్రవేశం ఎస్పీ డా. శబరీష్,ఐ.పి.ఎస్ మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్,డోర్నకల్, కేసముద్రం,తొర్రుర్, మరిపెడ కేంద్రాలలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సెక్షన్ శుక్రవారం ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ధర్నాలు,రాస్తారోకోలు,ఊరేగింపులు,సభలు,సమావేశాలు,టపాకాయలు కాల్చడం,విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధించబడినవని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, వారి ఏజెంట్లు నిషేధిత వస్తువులు అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు పదార్థాలు లేదా భద్రతకు హానికరమైన ఎలాంటి వస్తువులు లెక్కింపు కేంద్రంలోకి తీసుకురాకూడదని తెలిపారు.తనిఖీలు నిర్వహించే సిబ్బందికి పూర్తిగా సహకరించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారికే లెక్కింపు కేంద్రంలో ప్రవేశం కల్పించబడుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లా ప్రజలు, అభ్యర్థులు మరియు రాజకీయ నాయకులు ఎన్నికల నియమావళిని గౌరవించి శాంతి భద్రతలకు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి చేయడమైనది.

