Breaking News

బాలున్ని చితికబాదిన సంఘటనపై విచారణ జరిపిన డి డబ్ల్యూ ఓ, సిడిపివో, తహసిల్దార్ఎస్సై రాహుల్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో అంగన్వాడి సెంటర్లో అంగన్వాడీ టీచర్ రాణి బాలున్ని చితకబాదినట్లు వచ్చిన ఆరోపణలపై సిరిసిల్ల డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం సిడిపిఓ ఉమారాణి తహసీల్దార్ సుజాత ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి , సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ జిల్లా అధ్యక్షులు లాల్ మొహమ్మద్ గురువారం వేరువేరుగా విచారణలు జరిపారు, వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొంపెల్లి లక్ష్మి విజయ్ కుమార్ లు తమ కుమారుడు కొంపెల్లి విధ్వాన్సు (3 ) ను అంగన్వాడీ టీచర్ రాణి అకారణంగా కొట్టిందని ఆమే పై విచారణ జరిపి చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్సై రాహుల్ రెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గురువారం వెంకటాపూర్ వెళ్లి విచారణ జరిపారు,
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీ డబ్ల్యూ ఓ లక్ష్మీరాజ్యం సిడిపిఓ ఉమారాణి తహసిల్దార్ సుజాత ఆర్ఐ శ్రవణ్ కుమార్, గురువారం వెంకటపురం గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు, బాలుని చితకబాది గాయపరిచిన అంగన్వాడీ టీచర్ రాణి పై విచారణ జరిపి సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాలునికి చికిత్స కోసం అయిన ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాల్ మొహమ్మద్ డిమాండ్ చేశారు,
ఆయనతో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ సభ్యులు ప్రభాకర్ లు ఉన్నారు

అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు