Breaking News

అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు

అమ్మకాలను నిలిపివేయాలని సిఐ కి వినతి పత్రం

మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట

బాలున్ని చితికబాదిన సంఘటనపై విచారణ జరిపిన డి డబ్ల్యూ ఓ, సిడిపివో, తహసిల్దార్ఎస్సై రాహుల్ రెడ్డి

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని వెంటనే అమ్మకాలను నిలిపివేయాలని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్
సిఐ శ్రీనివాస్ కు రాజన్నపేట గ్రామస్తుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ధ్యాప దేవయ్య గురువారం అందజేశారు,
ఎక్సైజ్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవటం లేదని ఇప్పటికైనా రెండవ వార్డులో రెండు మద్యం దుకాణాలు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారని దీనివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని దీనివల్ల గ్రామంలో యువకులు విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశంతో పాటు తప్పుదారి పట్టె అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు, సంబంధిత ఎక్సైజ్ అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ పద్ధతి ప్రకారం గ్రామాలలో మద్యం దుకాణాలను ఉండకుండా చూడాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాన్ని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ కు అందజేశారు