Breaking News

జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తా ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ పిట్లం:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు. ఆయన మంగళవారం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైర్మన్ గా మనోజ్ కుమార్, వైస్ చైర్మన్ గా కృష్ణారెడ్డి, పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని నియాంసాగర్ ప్రాజెక్టుకు 100 యేళ్ల చరిత్ర కలిగి ఉందని త్వరలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద , కౌలాస్ కోటను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో నిజాంసాగర్ నుండి ఇతర మండలాలకు సాగునీరు అందేలా నాగమడుగు లిఫ్టును నూతన డిజైన్తో నిర్మాణం పనులు త్వరగా పూర్తీ అయ్యేలా చర్యలు చేపడుతున్నామన్నారు. లెండి ప్రాజెక్టు పూర్తిచేసి నియోజకవర్గానికి సాగునీరు అందేలా సంబంధిత శాఖ మంత్రి ని సంప్రదించడం జరిగిందన్నారు. నియోజకవర్గం లోని విద్యాభివృద్ధి, క్రీడా పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంబి హనుమన్లు, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య, విండో చైర్మన్లు శపథం రెడ్డి, సాయి రెడ్డి, నాగిరెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇమ్రోస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ రామ్ రెడ్డి, మోహన్ రెడ్డి, శివకుమార్, ఎనుగండ్ల శ్రీనివాస్ రెడ్డి, మురళి గౌడ్, వెంకట్ రెడ్డి, చింతల్ సాయిరెడ్డి, నరసింహ చారి, బాబు సింగ్, ఆయా మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏఎంసీ సెక్రెటరీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.