Breaking News

హిందూ చైతన్య వేదిక దేవాపూర్ ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట

*కార్తీక మాసంలో ఆదరణ లేని ఆలయాల అన్వేషణ హిందూ చైతన్య వేదిక

*హిందువులను సంఘటితం చేయడమే ప్రధాన లక్ష్యం అంటున్న సంఘ సభ్యులు

మన ప్రగతి న్యూస్ /మంచిర్యాల జిల్లా:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మంచిర్యాల జిల్లా దేవపూర్ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం ఉదయం పెద్దాపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం సంఘ కమిటీ సభ్యులు అందరు కలిసి నిర్వహించడం జరిగింది. కమిటీ సభ్యులు మాట్లాడుతూ హిందు చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరో శుభ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.ఓరియంట్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం కొన్ని సంవత్సరాలకు ముందు పెద్దపూర్ కోలంగూడెంలో దేవాలయం నిర్మించారని, కానీ అందులో అనివార్య కారణాల చేత విగ్రహం ప్రతిష్ఠ ఎవ్వరు చేయలేదఅన్నారు. కొన్ని సంవత్సరాలగా పెద్దపూర్, కోలం గూడెం, ప్రాంత ప్రజలు ఆంజనేయస్వామి విగ్రహం ఎప్పుడు తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తారని ఎదరు చూడడం జరిగిందని,హిందు చైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి దేవాలయం ఒక్క పుణ్యక్షేత్రల భావించి ప్రతి మంగళవారం ఒక్క దేవాలయం పంచామృతం అభిషేకం కార్యక్రమాలు చేస్తూ వస్తున్న తరుణంలో పెద్దపూర్ కోలం గూడెం ప్రజలు ఆంజనేయస్వామి విగ్రహం కావాలని తెలుపడంతో హిందూ చైతన్య వేదిక సభ్యులు స్పందించి ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేశారమని అన్నారు. అదేవిధంగా దాతల సహకారంతో అన్న ప్రసాదం కార్యక్రమం, మంగళవారం ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద పూర్ కోలం గూడెం ప్రజలు సంతోషం వ్యక్తం పరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంచినీళ్ల గణేష్ కుమార్ ,కొమురo లాల్ ,తొగరీ గజానంద్ ,పణగంటి కృష్ణమోహన్,వెడమ బాపు రావ్ ,వెల్మ. రాజేశ్వర్ రెడ్డి,రోడ్డ లక్ష్మి,కోడప భీమ్ రావ్ ,తోట మనోజ్ ,ఎలం రాజ్ కుమార్,పెంచాల రాజ్ కుమార్ ,కొమురవెల్లి సత్యనారాయణ,గుండా శ్రీనివాస్ ,కనక రాము,కురుశిoగ అచ్యుతరావుపెద్ద పూర్ కోలం గూడెం ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆత్రం, మహేష్, ఆత్రం భీమ్ రావ్, టేకo. రాజు, ఆత్రం భీమ్ రావ్, టేకo భీమ్ రావ్, టేక్o రాజేష్ తదతరులు పాల్గొనడం జరిగింది.