
జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
డిసెంబర్ -7 దాకా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలు
మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో
ప్రజా పాలన కళాయాత్ర సమాచార, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆద్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్ల తో సిద్ధం చేయగా, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,( రెవెన్యూ) కే.వీరబ్రహ్మచారి లు ప్రారంభించారు.ప్రజా విజయోత్సవాలు ఈ నెల 19 నుంచి 07 డిసెంబర్ 2024 వరకు జిల్లాలోని మహబూబాబాద్,మరిపెడ,డోర్నకల్,తొర్రూరు మున్సిపాలిటీలు, 18 మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి, ఇందిరా మహిళాశక్తి, గృహ జ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల పై టీం లీడర్లు గిద్దె రాంనరసయ్య, బండ వెంకన్న, రవీందర్ గౌడ్, నేతృత్వంలో ప్రచారం చేయనున్నారు. మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో, ప్రతి మండలం నుంచి మూడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ పి.రాజేంద్రప్రసాద్, డి సి ఓ వెంకటేశ్వర్లు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వడ్డేబోయిన శ్రీనివాస్, డిహెచ్ఓ మరియన్న, డీఏవో విజయనిర్మల, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.