లగిచర్ల ఘటనలో గిరిజనులకు భయపడ్డ ముఖ్యమంత్రి….
గిరిజన నేతలను మాజీ సర్పంచులను విద్యార్థులను అరెస్టు చేసి నిర్బంధించిన పోలీసులు…
ఇది ప్రజా పాలన కాదు ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన, పోలీస్ పాలన….
ఉద్యమాల గడ్డ పోరుగడ్డ వరంగల్ నుండి ముఖ్యమంత్రి పతనం ప్రారంభం….
పోలీస్ ల అక్రమ అరెస్టులను ఖండించిన బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత & నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.
మన ప్రగతి న్యూస్ /నర్సంపేట
సంవత్సరం కాలం పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి ఒక విజయం కూడా లేకుండా నేడు వరంగల్లో విజయోత్సవ సభలు నిర్వహించడం హాస్యస్పదమని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనులను విద్యార్థులను మాజీ సర్పంచ్లను బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇతర ప్రజాప్రతినిధులను అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించడం ఇది ప్రజా పాలన కాదు ఇది పోలీస్ పాలన 420 దొంగ హామీలతో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి నేడు రైతులకు, మహిళలకు , యువకులకు, విద్యార్దులకు , నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజాప్రతినిధులను ప్రతిపక్షాలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించి విజయోత్సవాలు నిర్వహించుకోవడం కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తుంది. రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు, పంటలకు బోనస్ ఇవ్వలేదు, రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాల
మహిళలకు 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి పథకం కింద 1లక్ష రూపాయలు తులం బంగారం ఎగపెట్టింది కాంగ్రెస్ పార్టీ.
2 లక్షల రుణమాఫీ రైతులకు సంపూర్ణంగా చేయలేదు
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు
4000 పెన్షన్ పెంచలేదు
రైతులకు రైతు భరోసా బోనస్ ఎగ్గొట్టినందుకు విజయోత్సవాల.
ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇల్లు కూల కొట్టినందుకు విజయ ఉత్సవాల.
అభివృద్ధి నీ మరిచి అవినీతి పెంచినందుక విజయోత్సవాల
100 రోజులలో 6 గ్యారంటి లు, 420 హామీలు అమలు చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి