_శుభోదయం మండల సమాఖ్య వారి ఆధ్వర్యంలో
మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్ ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా :ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా మొట్టమొదటి గా బహిరంగ సభ వరంగల్ లో హనుమకొండలో నిర్వహిస్తున్న సందర్భంగా ఇందిర మహిళ శక్తి సంబరాలు ముస్తాబాద్ మండలం శుభోదయ మండల సమాఖ్య వారి ఆధ్వర్యంలో మండలం లోని అన్ని గ్రామాల నుండి మహిళలు.సమాఖ్య లీడర్లు. అధ్యక్షురాలు. ప్రజాపాలన విజయోత్సవ బస్సు యాత్రకు బయలుదేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వడ్డీ లేని రుణాలు.మహిళలకు సబ్సిడీ గ్యాస్.200 ఉచిత విద్యుత్ ఇస్తున్న సందర్భంగా మహిళలు రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య మండల సభ్యులు సిసి శోభన్. అధ్యక్షులు దేవిక. కార్యదర్శి సంధ్య. సహాయ కార్యదర్శి నందిని. మండల సమైక్య సభ్యురాలు లత.గ్రూపుల సభ్యులు 50 మంది మహిళలు సభకు తరలి వెళ్లారు.