మన ప్రగతి న్యూస్ / కీసర ప్రతినిధి:
మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని ధమ్మాయిగూడా మున్సిపాలిటీ కుందన్ పల్లి చౌరస్తా వద్ద యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.చీర్యాల వెళ్తున్న స్కూల్ బస్సు రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టు వద్ద ఆగింది. బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించారు.