టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
మన ప్రగతి న్యూస్/ సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కులగనన వలన రాష్ట్రంలోని విద్య, వైద్యం, ఉద్యోగ, ఆర్థిక విషయాలు తెలుస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆర్టీసీ బస్సుల వలన మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని, గ్యాస్ తక్కువ ధరకే అందుతుందని, 200 యూనిట్ల వరకు కరెంటు పేదలకు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 11 నెలలోనే 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, కేసి ఆర్ పాలన మాత్రం మాటల వరకే జరిగిందని , చేసింది ఏమీ లేదని తెలిపారు. మా ప్రభుత్వం చేతల ప్రభుత్వమని , బిజెపి , టిఆర్ఎస్, ప్రభుత్వం వచ్చిన 15 రోజులకే కూల్చాలని ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడం అంత సులువు కాదని ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసి జిల్లా మొత్తం మనకే అధిక మెజార్టీ మనకే వస్తుందని, జనవరి నెలలో సంబరాలు చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు.
దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఐదు లక్షల వరకు చేయడం జరిగిందని, 10 లక్షల వరకు పొడిగించే అవకాశం ఉందని, ప్రతి ఒకరికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని, పేదవారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 3500 వరకు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం ఎంతో సంతోషకరమని, అనేకమంది పేదవారికి ఇందిరమ్మ ఇచ్చిన భూములే ఉన్నాయని, కులగనన ప్రతి కులం వారికి వారి యొక్క ఆర్థిక పరిస్థితుల తెలియజేయడం జరుగుతుందని మరియు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ,నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి , మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ , రాష్ట్ర కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు చేర్యాల ఆంజనేయులు, సదాశివపేట్ టి డి సి చైర్మన్ రామ్ రెడ్డి, కొండాపురం ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సంగారెడ్డి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్, కంది, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట్, అందోల్, నారాయణఖేడ్, మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.