Breaking News

ప్రమాదవశాత్తు కారు బోల్తా..

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

డివైడర్ ఢీ కొట్టి కారు బోల్తాపడిన సంఘటన నడికూడ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడికూడ వాగు బ్రిడ్జి వద్ద గల.. సమీప కల్లు మండువ ఎదురుగా ఉన్న డివైడర్ ను ఢీ కొని కారు బోల్తా పడి ఉందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం కారు అద్దాలు పగిలి అందులోని వస్తువులు చిందరవందరుగా పడి ఉన్నాయని, అందులో గాయపడిన వ్యక్తులు ఎవరు లేరని తెలిపారు.

Oplus_131072

మారుతి సెలెరియా గా కారును గుర్తించారు. కారు నెంబర్.. TS 02 FA 1355 గా స్థానికులు గుర్తించారు. పరకాల పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి