రిజర్వాయర్ వ్యతిరేక పోరాట కమిటీ అక్రమ అరెస్టు
సర్పంచుల పెండింగ్ బిల్లులు గురించి సర్పంచ్ ల అక్రమ అరెస్ట్
మన ప్రతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని రిజర్వాయర్ వ్యతిరేక పోరాట కమిటీని, మండలంలోని సర్పంచులను అర్ధరాత్రి సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
శాంతియుతంగా రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రిజర్వాయర్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని మెమోరాండం ఇవ్వడానికి కూడా స్వేచ్ఛ లేదు.
సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు గురించి శాంతి యుతంగా మెమోరాండం ఇవ్వడానికి కూడా స్వేచ్ఛ లేదు అని అన్నారు. ప్రజా పాలన అని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను ప్రజా ప్రతినిధులకు శాంతియుతంగా చెప్పే స్వేచ్ఛ కూడా ఈ ప్రభుత్వంలో లేదు. అలాగే సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వస్తే తొందర్లో చెల్లిస్తామని ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం సర్పంచ్ యొక్క బాధలను సమస్యలను వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం చేయట్లేదు.ఏది ఏమైనా ఎన్ని అరెస్టులు చేసినా మా పోరాటాన్ని ఆపేది లేదు రాష్ట్రంలో నిర్బంద పాలన కొనసాగుతోంది. పోలీస్ పాలన కొనసాగుతుంది.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సమస్యలు అడుగుతుంటే బిల్లులు అడుగుతుంటే సమాధానం చెప్పక అక్రమంగా అరెస్టులు చేయడం జరుగుతుంది. ఇలాంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాము లేదంటే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముంపు గ్రామాల బాధితులను కూడా కాపాడాలని రిజర్వాయర్ నిర్మాణం ఆపాలని లేనియెడల ఎన్నిసార్లు అరెస్టులు చేసిన మా మీద కేసులు పెట్టినా కానీ రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ముంపు గ్రామస్తులు తెలిపారు.