Breaking News

ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలని నూతన కౌన్సిలర్లకు సూచన – మాజీ మంత్రి

వైరా బీఆర్ఎస్ నేత లకావత్ గిరిబాబుకు ప్రత్యేక సత్కారం

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు… యువకుడు నవీన్ ప్రాణం బలి..

ఖమ్మం పట్టణంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరియు మిత్రపక్షాల పార్టీ కౌన్సిల్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రజాప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, సంక్షేమ కార్యక్రమాల అమలులో సమన్వయంతో ముందుకు సాగాలని కౌన్సిల్లర్లను కోరారు.మిత్రపక్షాల అభ్యర్థుల విజయానికి కృషి చేసిన లకావత్ గిరిబాబును ప్రత్యేకంగా అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. వైరా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చేసిన సేవలను ఆయన ప్రశంసించారు. వైరా నియోజకవర్గంలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మంకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం సౌహార్ద వాతావరణంలో కొనసాగి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.