-ఏడిఏ శ్రీధర్.
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం రైతులకు యూరియా కొరత లేదని మానకొండూరు ఏడిఏ శ్రీధర్ అన్నారు.మొలంగూరు,తాడికల్,కొత్తగట్టు,ముత్తారం గ్రామాల్లో 1800 యూరియా బ్యాగులను రైతులకు అందించడం జరిగిందన్నారు.మొబైల్ లింక్ లేని రైతులకు,ఆన్లైన్లో మొబైల్ లింక్ చేయడం జరిగిందన్నారు.ఎరువుల గోదాములకు మరో 100 టన్నుల యూరియా రానుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు కీర్తన,రాజ్ కుమార్,సునందన పాల్గొన్నారు.

