Breaking News

బీజేపీలో చేరిన నూతనంగా గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులు

మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా ప్రతినిధి:

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో కొనసాగుతున్న కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి సంఘీభావంగా బిజెపి పార్టీలో చేరిన నూతనంగా ఎన్నికైన 17వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పోరేటర్ వేముల కవిత చంద్రశేఖర్, 39వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ మాసం గణేష్ శనివారం కేంద్ర సహాయ మంత్రి బండి సమక్షంలో ఖాషాయ కండువ కప్పుకున్నారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయం జండా ఎగరవేయడం,సొంతం చేసుకోవడం చాలా శుభ పరిణామం అని,ఈరోజు కరీంనగర్ నగర అభివృద్ధి చూసి,ప్రధాని నరేంద్రమోడీ అమలు పరుస్తున్న పథఖాలు,అభివృద్ధిని చూసి నూతనంగా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన అభ్యర్థులు బీజేపీలో చేరడం చాలా సంతోషమని, బీజేపీ లో చేరిన అభ్యర్థులకు ఖాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ అద్భుత అవకాశాన్ని నాకిచ్చి మా బీజేపీ అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ యొక్క సారధ్యంలో కరీంనగర్ అభివృద్ధి చేసే అవకాశాన్ని కరీంనగర్ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు కరీంనగర్ నగర ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు… యువకుడు నవీన్ ప్రాణం బలి..