Breaking News

సత్యంకోసం కలం సమాజంకోసం ప్రెస్ క్లబ్

ఘనంగా భక్త రామదాసు ప్రెస్ క్లబ్ ఆవిర్భావం

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలిచే మీడియా రంగంలో నూతన అధ్యాయానికి పునాదిపడింది. నేలకొండపల్లి పట్టణంలో శనివారం ఘనంగా ఏర్పాటు చేసిన భక్త రామదాసు ప్రెస్ క్లబ్ ఆవిర్భావ వేడుకలు పాత్రికేయ లోకానికి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కలం శక్తిని సమాజ శక్తిగా మలిచే వేదికగా ఈ భక్త రామదాసు ప్రెస్ క్లబ్ రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ బీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతరాములు, నేలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు హాజరై ప్రెస్ క్లబ్ ను ఘనంగా ఆవిర్భవించారు.

ప్రెస్ క్లబ్ ప్రజా సమస్యలకు ప్రతిధ్వని కావాలి: బీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై భక్తరామదాసు ప్రెస్ క్లబ్ ను ఆవిష్కరించవల్సియుండగా.. బిజీ షెడ్యూల్ చేత వారి ప్రతినిధిగా మీ అందరి అభిష్టం మేరకు నన్ను హాజరవ్వాలని ఆదేశించారని తెలియజేశారు.
ఈ ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి బీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… “ప్రెస్ క్లబ్ అనేది కేవలం భవనం కాదు… అది ఆలోచనల ఆవాసమని, ప్రజా సమస్యలకు ప్రతిధ్వని” అని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ ఆవిర్భావంతో స్థానిక సమస్యలు మరింత స్పష్టంగా వెలుగులోకి వస్తాయని, ప్రజా ప్రతినిధులు – అధికారులు బాధ్యతగా స్పందించే వాతావరణం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సత్యం కోసం కలం పని చేయాలి: తహసీల్దార్ వెంకటేశ్వర్లు

సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు… యువకుడు నవీన్ ప్రాణం బలి..

పాత్రికేయులకు కచ్చితమైన మార్గనిర్దేశంతో పాటు నైతిక విలువలతో కూడిన జర్నలిజాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. “సత్యం కోసం కలం… సమాజం కోసం ప్రెస్ క్లబ్” అనే నినాదంతో ప్రారంభమైన ఈ వేదిక, భవిష్యత్తులో ప్రజాస్వామ్య రక్షణకు కీలకంగా మారాలని ఆకాంక్షించారు.

వెన్నెపూసల సీతరాములు మాట్లాడుతూ..

ప్రెస్ క్లబ్ ఆవిర్భావం కేవలం ఒక సంఘటన కాదు… అది జర్నలిస్టుల ఐక్యతకు ప్రతీక, ప్రజా ప్రయోజనాల కోసం పోరాటానికి నూతన అధ్యాయమని నైతిక విలువలతో కూడిన జర్నలిజం అభివృద్ధికి ఈ క్లబ్ కృషి చేయాలని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ శీలం వెంకటలక్మి, ఉప సర్పంచ్ మద్దినేని మహేష్, కొత్త కొత్తూరు ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, బిజెపి మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ మధు, ఫారెస్ట్ ఆఫీసర్ డానియేలు, అపర మేధావి గుగ్గిళ్ల దివ్యమూర్తి, కాంగ్రెస్ యువజన నాయకులు కొమ్మూరి నరేష్, దోసపాటి రామదాసు, పసుపులేటి ఉపేందర్, మాల మహానాడు నాయకులు బట్టపోతుల ప్రకాశం, ఉత్తమ సామాజిక అవార్డు గ్రహీత బొడ్డు బాబురావు, రాజకీయ పుర ప్రముఖులు, కుల సంఘనాయకులు, మేధావులు, తదితరులు పాల్గొన్నారు.