Breaking News

సైకిల్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

-స్పాట్ లోనే ఒకరు మృతి

ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి హైవే పై ఘటన

మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట:

బోలా శంకరుడి అనుగ్రహం అందరి పై ఉండాలి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ కాలనీ గేటు ఎదురుగా సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై గోరింటాకు చెందిన బత్తుల రాజయ్య అనే వృద్ధుడు సైకిల్ పై ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా వెనుకాల నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గోరంటాల గ్రామానికి చెందిన బత్తుల రాజయ్య, (70) సంవత్సరాలు గొర్ల మందుల కోసం ఎల్లారెడ్డిపేటకు వెళ్తుండగా వెనకాల నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.. కాగా నెల క్రితం దుమాల గ్రామానికి చెందిన ఒకరు టీవీఎస్ షాంపూ, పై సెకండ్ బైపాస్ కు మలుగుతుండగా బస్సు ఢీ కొట్టడంతో మృతి చెందిన ఘటన మరువక ముందే . ఈ సంఘటన చోటుచేసుకుంది ఢీ కొట్టిన ఆర్టీసీ కరీంనగర్ డిపో బస్సు ఢీకొట్టడంతో బత్తుల రాజయ్య మృతి చెందాడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు ఎల్లారెడ్డిపేట పోలీస్ లు మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు