-కొంపల్లి ఐదవ బ్రాంచ్ లో వేడుకలు
మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట:
కొంపల్లిలోని శ్రీ చైతన్య పాఠశాల-5 వ బ్రాంచ్ లో ఘనంగా వార్షికోత్సవం వేడుకలు జరిగాయి. ఈవేడుకలకు ముఖ్య అతిధులుగా ప్రొఫెసర్ బి ఎన్ రెడ్డి, శ్రీ చైతన్య పాఠశాలల కొంపల్లి జోన్-2 ఏజీఎం కె శ్రీనివాసరావు, స్థానిక కొంపల్లి లోని సురక్ష హాస్పిటల్ డాక్టర్ శ్రీనాథ్, రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రెన్యూర్ శైలేందర్ పాల్గొన్నారు. వారందరూ కలిసి జ్యోతిని వెలిగించారు. అనంతరం విద్యార్థులు సరస్వతీ దేవి స్వాగతం నృత్యంతో మధుర గీతాలాపనలతో అతిధులను ఆహ్వానించారు. కొంపల్లి జోన్-2 ఏజీఎం కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి పాఠశాల లక్ష్యమని క్రమశిక్షణ, కృషి,పట్టుదల అనే మూడు మంత్రాలతో ముందుకు సాగితే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని,అది కేవలం శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకే సాధ్యమని అన్నారు. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బియన్ రెడ్డి, డాక్టర్ శ్రీనాథ్ లు మాట్లాడుతూ విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిన శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 వ శాఖ భవిష్యత్తులో ఇలాంటి వైభవోపేత కార్యక్రమాలతో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని తెలిపారు. అలాగే పాఠశాల ప్రిన్సిపల్స్ నాగమణి,చందు మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో, ఐఐటి , మెడికల్ సీట్లలో ర్యాంకులు సాధించడం, ఒలంపియాడ్ పరీక్షల్లో ఉన్నత ఫలితాలు సాధించడం, కేవలం శ్రీ చైతన్య పాఠశాల అగ్రస్థానంలో నిలుస్తుందని తల్లిదండ్రులకు, విద్యార్థులకు నివేదికతో సమర్పించారు.వార్షికోత్సవ వేడుకలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు,నాటికలు,దేశభక్తిని పెంపొందించే నృత్యాలు,రావణ సంహారం,ఆపరేషన్ సింధూర్, తల్లిదండ్రులు చిన్నారులతో కలిసి వేసిన డాన్సులు,విద్యార్థులతో ఉపాధ్యాయులు కలిసి వేసిన డాన్సులు కన్నుల విందుగా అలరించాయి. ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య పాఠశాలల కొంపల్లి జోన్ హైస్కూల్ అకడమిక్ స్టేట్ కోఆర్డినేటర్ సి.రవి, సీబీఎస్సీ కోఆర్డినేటర్ రవికుమార్, అసోసియేట్ కోఆర్డినేటర్ సోమేశ్, ప్రైమరీ సీబీఎస్సీ కోఆర్డినేటర్ అన్నపూర్ణ, ప్రైమరీ ప్రైమరీ జోనల్ స్టేట్ కోఆర్డినేటర్ లావణ్య, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ కావ్య, పాఠశాల అకడమిక్ డీన్ గోవింద్, ఐపీఎల్ ఇన్చార్జి సీతారాం, ఐకాన్ ఇన్చార్జి రాములు, ఎం పి ఎల్ ఇంచార్జి సందీప్, వైస్ ప్రిన్సిపల్ కేశవ, ప్రైమరీ ఇన్చార్జి వాసవి, ప్రీ ప్రైమరీ ఇన్చార్జి విజయ, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేసి సంతోషాన్ని వ్యక్తపరచారు.

