- వైభవంగా సామూహిక మహన్యాస రుద్రాభిషేక కార్యక్రమం
మన ప్రగతి న్యూస్ / వర్దన్నపేట :
వర్ధన్నపేట మండల పరిధిలోని నల్లబేల్లి గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించ నిర్వహించామని గ్రామ సర్పంచి జక్కి అనిత శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనిత శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని గ్రామంలో సామూహికంగా 100 మంది పుణ్య దంపతులచే సామూహికంగా మహాన్యాస రుద్రాభిషేక కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులచే ఘనంగా నిర్వహించామని తెలిపారు . సన్నాయి మేళాలతో సంస్కృతిక కోలాటాలతో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామని అన్నారు. కళ్యాణం ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం ఉత్సవాలను ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేకల దేవేందర్, గ్రామ ప్రముఖులు, భక్త భజన మండలి, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

