Breaking News

మండలంలో వైభవంగా శివరాత్రి మహోత్సవ వేడుకలు

శివాలయాలకు పోటెత్తిన భక్తజనం

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

బోలా శంకరుడి అనుగ్రహం అందరి పై ఉండాలి

శివోహం శివోహం శివోహం
హర హర మహాదేవ శంభో శంకర..అంటూ భక్తజనం పరవశంతో ఆ పరమశివుని ప్రార్థిస్తూ శివరాత్రి పర్వదిన వేడుకలు మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా జరిగాయి.మండల కేంద్రంతోపాటు మండలంలోని గుండ్లపహాడ్,మేడపల్లి, కొండాపూర్, నల్లబెల్లి గ్రామాలలోనీ శివాలయం రామాలయం ఆలయాల్లో శివరాత్రి పర్వదినం సందర్భంగా వేకువ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణ ఉత్సవ విగ్రహాలకు నూతన వస్త్రాల అలంకరణ కార్యక్రమాలు చేపట్టిన అనంతరం అభిషేకాలు అర్చనలు నిర్విరామంగా కొనసాగాయి. దేవాలయాల అర్చకులు భక్తులకు సంకల్పాన్ని ఉచ్చరించి అనంతరం మహా అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు (మారేడు) బిల్వదళాలతో గంగాజలంతో జంగమయ్యకు మనసారా అభిషేకాన్ని చేసుకున్నారు. కొన్ని దేవాలయాల్లో మధ్యాహ్నం వేళలో శివ కళ్యాణం నిర్వహించగా రాత్రివేళ పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామికి కళ్యాణాన్ని నిర్వహించారు. మొత్తంగా మండలంలోని ఆలయాలన్నీ శివనామ స్మరణతో భక్తులందరూ శివరాత్రి పర్వదిన వేడుకలు మండల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. దేవాలయాల్లో అర్చకులు భక్తులకు పంచామృత జలాన్ని ప్రసాద రూపంలో వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా ఆలయాల ధర్మకర్తలు, దేవాలయాలఅర్చకులు,దేవాలయ కమిటీ చైర్మన్లు కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.