మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం కొత్తగట్టులో దొంగలు బీభత్సం సృష్టించారు.శనివారం రాత్రి మడ్డి శ్రీనివాస్ ఇంట్లో బీరువాలోని అర్ధతులం బంగారం,పెసరి రాజేశ్వరి ఇళ్లలోని 30 తులాల వెండి ఆభరణాలు, నగదు రూ.20 వేలు తాళాలు పగలగొట్టి దోచుకెళ్లారు.మాడ వెంకట్ రెడ్డికి చెందిన ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.వరుస చోరీలతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.

