Breaking News

భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర.. 1.40 లక్షల మందికి పైగా దర్శనం.

మన ప్రగతి న్యూస్/వేములవాడ:

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ వెల్లువెత్తింది. ఈవో రమాదేవి ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటన లో, స్వామివారిని 1.40 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంకు అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు మొత్తం 1,40,813 మంది భక్తులు దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా, శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు భక్తులు 9,859 కోడె మొక్కులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలి పారు. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఏర్పాట్లు సజావుగా కొనసాగినట్లు పేర్కొన్నారు.

సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం..