రథోత్సవంలో అందరు పాల్గొనాలి
ఆలయ అర్చకులు నాగయ్య శాస్త్రి, కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు:
మండల కేంద్రంలో ఆదివారం రోజు మహాశివరాత్రి శుభ సందర్భంలో శ్రీ శివపార్వతి సహిత భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం 11:30 వరకు అభిషేకం జరిగినది రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు శివ కళ్యాణం జరిగినది 12 గంటల నుండి లింగోద్వకాలం సమయంలో తెల్లవార్లు అభిషేకాలు భక్తులు అభిషేకము చేశారు. అత్యధిక మంది భక్తులు డాక్టర్ రమేష్ సంజన దంపతులు కళ్యాణ దాతలుగా వ్యవహరించినారు. గౌరవ కమిటీ సభ్యులు కూరపాటి వెంకటేశ్వర్లు గట్టు వెంకటేశ్వర్లు, వేముల సుధాకర్, పాము రవీందర్, పాము వెంకటనారాయణ, బేతు విజయకుమార్, పేతు శ్రీనివాస్, వేముల శ్రీనివాస్, గుండా రమణయ్య, వేముల వెంకన్న, వేముల సంపత్ కుమార్ దంపతులతో సహా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు వెలుకూచి నాగయ్య శాస్త్రి, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అత్యధిక మంది భక్తులు మార్కండేయ ఆలయంలో హరహర నామస్మరణతో ఆలయం కిటకిటలాడి భక్తులు భక్తి లో స్వామివారి కైంకర్యాలు పూర్తి చేశారు.

