మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి:
మండల కేంద్రంలోని బిలనాయక్ తండా శివారులో సోమవారం నేషనల్ హైవే 365 రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఆటో డీ కొన్నది…రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నర్సంపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు .స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలనాయక్ తండా శివారు 365వ జాతీయ రహదారిపై నర్సంపేట నుంచి అడవి మల్లంపల్లి వైపునకు వెళ్తున్న ట్రాక్టర్ అకస్మాత్తుగా ఆగింది. దీంతో దాని వెనుక వస్తున్న ఆటో అదుపుతప్పి ట్రాక్టర్లు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గూడూరు మండలంలోని మట్టేవాడ గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు హరిబండి రత్నమాల (50), హరిబండి సునీల్ (30) నర్సంపేట నుండి మల్లంపల్లి కు ఆటోలో వెళ్తున్నారు.



