మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం….. మండల కేంద్రానికి చెందిన పులి మల్లికాంబ ఇంట్లోకి ఉదయాన్నే కోతులు చొరబడి దాడి చేసాయి. ఈ క్రమంలో వృద్దురాలు కిందపడడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వృద్దురాలిని చికిత్స
నిమిత్తం నర్సంపేట ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లినట్లు తెలిపారు.గ్రామంలో విచ్చలవిడిగా కోతులు స్పైరా విహారం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోతుల గుంపుల కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. గ్రామంలోఉన్న కోతుల బెడదను వెంటనే నివారించాలని గ్రామస్తులుఅధికారులను కోరుతున్నారు.

