మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా స్టాపర్:
రాజన్న సిరిసిల్ల జిల్లా : కేంద్రంలో మున్సిపల్ చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను మూడో వార్డు ప్రజలు గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన చైర్మన్ పదవికి సహకరించిన తోటి 27 మంది కౌన్సిలర్లకు ఆమె అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. తనను నమ్మి బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే రోజుల్లో గతంలో కంటే ఎక్కువగా అభివృద్ధి పనులు చేస్తూ, సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డులను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు…సిరిసిల్ల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైనందుకు దార్ల సందీప్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఈ పదవి దక్కేలా సహకరించిన 27 మంది తోటి కౌన్సిలర్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన రాజకీయ ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన 34వ వార్డు ప్రజలతో పాటు, పట్టణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.తొలిసారిగా వైస్ చైర్మన్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సిరిసిల్ల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని భరోసా ఇచ్చారు. అందరి సహకారంతో పట్టణ సమస్యల పరిష్కారానికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా దారుల సందీప్ స్పష్టం చేశారు…

