ఎడ్లబండ్ల ప్రదర్శనతో సంప్రదాయ వైభవం
జెండా ఆవిష్కరణ కొబ్బరికాయలతో మొక్కులు
ముఖ్య అతిథులకు శాలువాతో సత్కారం
రేపు ఘనంగా కుస్తీ పోటీలు
మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:
ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల గ్రామ కుచ్చాపై వెలసిన బ్రహ్మదేవుడికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరుసటి రోజు నిర్వహించే సంప్రదాయ ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎడ్లబండ్ల ప్రదర్శన, జెండా ఆవిష్కరణ, కొబ్బరికాయలతో మొక్కులు తీర్చడం వంటి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ హాజరయ్యారు. గ్రామ ప్రజలు, మండల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో సిరిసంపదలు తూలతూగాలని కుడుముల సత్యనారాయణ ఆకాంక్షించారు. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ముఖ్య అతిథులకు గ్రామ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగలి సంతోష్, మాజీ జెడ్పిటిసి సామెల్, సొసైటీ మాజీ చైర్మన్ బోండ్ల సాయిలు, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, అడవిలింగాల శ్రీనివాసరెడ్డి, గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంగళవారం కుస్తీ పోటీలు పాల్గొనండి, వీక్షించండి
మంగళవారం సాయంత్రం గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగల వారు పోటీల్లో పాల్గొనవచ్చని, మండల ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై వీక్షించాలని కోరారు.

