మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్టాఫర్:
కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో బీఆర్ ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు,బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్,బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీరామకృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అపర భగీరథుడు కేసీఆర్ గారు జన్మదిన సందర్భంగా జిల్లా పార్టీ మరియు నగర పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కేసీఆర్ ఉద్యమ నాయకుడు,తెలంగాణ తెచ్చిన నాయకుడు,చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు వారి జన్మదినాన్ని ఇవాళ పండుగ వాతావరణంలో కరీంనగర్ నగరంతో పాటు ఇతర జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజలు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.కేసీఆర్ మనకు తెలంగాణ ఇచ్చి నీళ్లు నిధులు నియమాకాలు,అనేక సంక్షేమ పథకాలు,రైతులకు వడ్డీలేని రుణాలు,వృద్ధాప్య పింఛన్లు,కళ్యాణ లక్ష్మి,ఆరోగ్యశ్రీ,గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్,సన్నబియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలు అందించారు.కేసీఆర్ అందరికీ నాయకుడు ప్రజలందరూ మమేకమై ఈ రోజు కేసీఆర్ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.కేసీఆర్ ఆయురారోగ్యాలతో వందసంవత్సరాలు జన్మదినాలు జరుపుకోవాలని,తెలంగాణ ప్రజలు సుపరి పరిపాలన ఇచ్చినందుకు,మళ్లీ ముఖ్యమంత్రిగా ముందుకు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.కేసీఆర్ గారు ప్రజలందరి ఆశీస్సులతో,అందరి దీవెనలతో గొప్పగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి ముఖ్యమంత్రిగా పరిపాలించే అవకాశం వారికే ఉందంటూ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ తెచ్చుకున్నాం. భారత దేశంలోనే తెలంగాణ మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం.ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథకంలో గాని,సంక్షేమ పథకంలో గాని దేశమే, ప్రపంచం తెలంగాణ వైపు చూసే విదంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచిన మహానాయకుడు, గొప్ప నాయకుడి కేసీఆర్ గారి జన్మదినం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది.కేసీఆర్ గారు,వారి కుటుంబం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.
అనంతరం స్థానిక ప్రజలకు పూల మొక్కలను, స్వీట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు,బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్,బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీరామకృష్ణారావు,మరియు కార్పొరేటర్లు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


