Breaking News

విరిగిన విద్యుత్ స్తంభం.

  • తప్పిన పెను ప్రమాదం ..

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:

నల్లబెల్లి మండలంలోని బస్టాండ్ దగ్గర లో గల జియో ఆఫీస్ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని విద్యుత్ స్తంభం విరిగిపోయింది. విద్యుత్ స్తంభం విరగడంతో ఎలాంటి ప్రమాదం జరగ కుండా విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విరిగిన స్తంభం ఏ క్షణంలోనైనా కూలిపోతే విధంగా ఉండడంతో స్థానికులు ఆందో ళన చెబుతున్నారు. విద్యుత్ అధికారు లు ఆ విరిగిన స్తంభాన్ని వెంటనే తొల గించి, నూతన విద్యుత్ స్తంభాన్ని అమర్చి, సరఫరాను పునరుద్ధరించా లని, అంతేకాకుండా సిసి రోడ్ పైన ఉన్న స్తంభా లను తొలగించి, సీసీ రోడ్డు అవ తలి వైపు వేయాలని గ్రామస్తులు కోరు తున్నారు. ఆ స్థంభాలు కూడా ప్రమాద పు అంచులలో ఉన్నాయని, అవి కూడా పడిపోయేలాగా ఉన్నాయని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి, సిసి రోడ్డు పైన ఉన్న స్తంభాలను సరి చేయాలని కోరుతున్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు