మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి
ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలోని రైతు వేదికలో గురువారం వైరా డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు టి. కరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు జరిగింది. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతులు అనుసరించాలన్నారు. రైతులకు భూసార పరీక్షల విశ్లేషణ పత్రాలు అందజేశారు. కేవీకే శాస్త్రవేత్త ఫణిశ్రీ జీవామృతం, నీమాస్త్రం తయారీ విధానాలు వివరించారు. మండల వ్యవసాయ అధికారి ఎ. నరసింహారావు, వ్యవసాయ విస్తరణ అధికారులు నవ్య, కమలాకర్, రైతులు పాల్గొన్నారు.


