Breaking News

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

మన ప్రగతి న్యూస్/సిరిసిల్ల, జిల్లా స్టాపర్:

ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా అధిక దిగుబడితో పాటు దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చని, పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.ఆయిల్ పామ్ సాగు, ఫెర్టిలైజర్ యాప్, వ్యవసాయ యాంత్రీకీకరణ, రైతుల వివరాల నమోదు, క్రాప్ బుకింగ్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయా ల సముదాయం లో గురువారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.. జిల్లాలో క్రాప్ బుకింగ్ కోసం ఏఈఓలకు సహాయం అందించేందుకు 165 మంది వాలంటీర్లను నియమిం చామని కలెక్టర్ దృష్టికి జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. క్రాప్ బుకింగ్ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
ఫార్మర్స్ రిజిస్ట్రీ కింద జిల్లాలోని అందరు రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. చనిపోయిన, డబుల్ ఎంట్రీ వివరాలు జాబితాలో లేకుండా పకడ్బందిగా చేయాలని స్పష్టం చేశారు. ఏవోలు, ఏఈవోలు సంయుక్తంగా ఈ ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేయాలని సూచించారు.
వ్యవసాయ యాంత్రీకీకరణ కింద జిల్లాకు మంజూరు అయిన పరికరాలకు రైతులు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఫెర్టిలైజర్ యాప్ వినియోగం, రైతులకు అందుతున్న సేవలపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్ష చేశారు. ప్రతి ఎరువుల షాప్, పీఏసీఎస్, ప్రైవేట్ షాప్స్ వద్ద హెల్ప్ డెస్క్, సహాయకులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

ఆయిల్ పామ్ సాగు పెంచాలి

ఉచిత కంటి వైద్య శిబిరం:

జిల్లాలోని రైతులకు ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి, లాభాలు తదితర అంశాలు వివరించి సాగు విస్తీర్ణం పెంచేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. త్వరలో 100 ఎకరాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులను వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు నేరుగా కలిసి మాట్లాడాలని, వారిని క్షేత్ర స్థాయి పర్యటనకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. ప్రతి ఏవో, ఏఈవో 10 ఎకరాల చొప్పున ఆయిల్ పామ్ సాగు కు డీడీలు రైతులు చెల్లించేలా చూడాలని సూచించారు. రైతు వేదికల్లో కనీస వసతులు కల్పించాలని జడ్పీ సీఈవో వినోద్ కుమార్ ను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు తదితరులు ఉన్నారు.