Breaking News

ఏకపక్ష ధోరణి మానుకోవాలి.మన ప్రగతి న్యూస్ ఎఫెక్ట్.. ( కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ ల కే నిధులా మన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నిధులను మండలంలోని అన్ని గ్రామాలకు వర్తించేలా నిధులు మంజూరు చేయకుండా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఏకపక్ష ధోరణి ఆలంబిస్తున్నారని అలా చేయడం సరికాదని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరి, మాజీ జెడ్పిటిసి మందడి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే వ్యవహార శైలి ని నిరసిస్తూ బీ ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులను కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా ఎన్నికైన కేవలం 10 గ్రామాలకే అట్టి నిధులను కేటాయించి మిగతా గ్రామాలకు కేటాయించకుండా ఎమ్మెల్యే బీర్ల రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సోనియా గాంధీ నాయకత్వాన్ని కించపరిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు అద్దం పట్టినట్లు కనిపిస్తుందని అన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం నిధులు అన్ని గ్రామాలకు మంజూరు చేయాలని కోరుతూ ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ మెరుగు చండీరాణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కునగళ్ళ లిల్లీ, రణమళ్ళ అనిత, కురుమిళ్ళ కవిత, చిప్పలపల్లి యాదమ్మ,గడ్డమీది మహోదయ్, అల్లంశెట్టి మహేష్, పంగా సతీష్, కునగళ్ళగణేష్, చిప్పలపల్లి నరసింహ, కాసం నగేష్, జక్కుల యాదయ్య, చెన్నారెడ్డి, నర్సిరెడ్డి ఎలిమినేటి నాగరాజ్, గోపాల్ దాస్ వెంకన్న, ఎలగందుల నాగరాజ్, కొమ్మ గళ్ళ దయాకర్, ఉపేందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రురాలు మృతి