మన ప్రగతి న్యూస్/ తెల్కపల్లి ప్రతినిధి
తెలకపల్లి తాగిన మైకంలో భర్త భార్యను చంపిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది స్థానిక ఎస్సై బి నరేష్ అందించిన వివరాల ప్రకారం బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన బంగారమ్మను తెలకపల్లి మండల పరిధిలోని లక్నారం గ్రామానికి చెందిన మన్యం శ్రీనుకు 26 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం చేశారు వీరికి ఇద్దరు పిల్లలు భార్యాభర్తల మధ్య గత మూడు సంవత్సరాల నుండి తరచూ గొడవ జరిగేదని అందులో భాగంగా శుక్రవారం రాత్రి మన్యం శ్రీను తప్ప తాగి భార్యతో ఘర్షణ పడి భార్య బంగారమ్మ ను అల్యూమినియం రాడుతో కొట్టడంతో ఆమెకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి అన్న ఆకారపు వెంకటయ్య శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి నరేష్ తెలిపారు.

