మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
మండలంలో హోలీ పండుగను మంగళవారం ప్రశాంతంగా జరుపుకోవాలని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకునేది లేదని,బహిరంగ ప్రదేశాలలో,పాదచారులు,ఇతరుల వాహనాలపై రంగులు చల్లొద్దని,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు రసాయనరంగులకు బదులు సహజసిద్ధమైన రంగులు వాడాలన్నారు.వేడుకల్లో డీజీలకు ఏలాంటి అనుమతి లేదని తెలిపారు.రోడ్లపై యువకులు బైక్ లతో న్యూసెన్స్ చేస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బావులు,చెరువులు,కెనాల్ వద్దకు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై అప్రమత్తంగా ఉండాలని,ప్రతి కుటుంబం హోలీ పండుగను ఆనందమయంగా జరుపుకోవాలని,మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

