Breaking News

తిమ్మారావుపేటలో దోమల నియంత్రణకు ఫాగింగ్ ను సర్పంచ్ సుమలత పర్యవేక్షణ

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి

ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో దోమల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి థర్మల్ ఫాగింగ్ యంత్రంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ గుగులోత్ సుమలత తెలిపారు.ప్రధాన రహదారులు, కాలనీలు, డ్రైనేజీలు మరియు నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో థర్మల్ ఫాగింగ్ ద్వారా పొగ పిచికారీ చేపట్టారు. కార్యక్రమాన్ని సర్పంచ్ స్వయంగా పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు.ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రత పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని సర్పంచ్ సూచించారు. గ్రామంలో ఇలాంటి నివారణ చర్యలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.

ఊయలే ఉరితాడుగా.. ఎనిమిదేళ్ల బాలిక మృతి