Breaking News

వేములవాడలో లాడ్జిలో యువకుడి హత్య కలకలం

మన ప్రగతి న్యూస్ / వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ సమీపంలో, ఓలాడ్జిలో యువకుడు హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్న యువకుడి గదిలోకి సుమారు 20 ఏళ్ల యువతి, ఓ వృద్ధుడు వెళ్లినట్లు సమాచారం.కొంతసేపటి తర్వాత యువతి, వృద్ధుడు కంగారుగా గది నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించిన లాడ్జి నిర్వాహకురాలు అనుమానంతో ఆ గదిలోకి వెళ్లి చూసింది.అక్కడ యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గదిని పరిశీలించి, లాడ్జి నిర్వాహకురాలు సహా పలువురి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. యువకుడి మృతి హత్యా, లేక ఇతర కారణాల వల్ల జరిగిందా, అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వేములవాడ దర్గా తరలింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు