స్టేట్ చైర్మన్ గా బండిపల్లి కిరణ్ కుమార్ ఎన్నిక ఘనసన్మానం…
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్ రైట్స్ ప్రజాహిత మానవ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోనిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నేషనల్ చైర్మన్, డైరెక్టర్ అల్లం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, నేషనల్ డైరెక్టర్, నేషనల్ మహిళా డైరెక్టర్ అలెం రమ చేతుల మీదుగా బండిపల్లి కిరణ్ కుమార్‌కు స్టేట్ చైర్మన్ పదవి అధికారికంగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా నేషనల్, స్టేట్ మరియు జిల్లా స్థాయి కమిటీ సభ్యులు కలిసి బండిపల్లి కిరణ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఆయన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజాహిత కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకెళ్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం సంస్థ మరింత చురుకుగా పనిచేయాలని, ప్రజలకు న్యాయం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోపాల్గొన్నవారు,నేషనల్ డైరెక్టర్ జారే బిక్షం సింగపల్లి అప్పారావు దూడపాక శివప్రసాద్ మరియమ్మ విజయ్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

