మన ప్రగతి న్యూస్ /వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలోని దుబ్బరాజేశ్వర ఆలయంలో దొంగతనం చోటుచేసుకుంది. ఆలయంలో అమ్మవారికి అలంకరించిన పుస్తెల తాళిని గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన కలకలం రేపింది.ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిరోజు లాగే పూజలు నిర్వహించేందుకు వెళ్లినప్పుడు అమ్మవారి తాళి కనిపించకపోవడంతో విషయం బయటపడింది. వెంటనే స్థానికులకు సమాచారం అందించడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.ఆలయ పరిస రాల్లో భద్రతా లోపాలపై కూడా ఆరా తీస్తున్నారు. భక్తులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

