Breaking News

రాబోయే 4 సంవత్సరాలలో లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇండ్లు నిర్మిస్తాం..

_ రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

మన ప్రగతి న్యూస్ రాజన్న సిరిసిల్ల/వేములవాడ ప్రతినిధి

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

వేములవాడ ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మనందరి కష్టం ఫలితంగా ఇందిరమ్మ రాజ్యం మన రాష్ట్రంలో ఏర్పడింది ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలతో పాటు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం గతంలో అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తే, ఈనాడు గుళ్ళు, బళ్ళు, వ్యవసాయం, మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులకు మేలు చేస్తున్నాం ఎన్నికలలో చెప్పకపోయినా పేదవాడు కష్టం తెలిసిన ప్రభుత్వం 40 శాతం మేర డైట్ చార్జీలు పెంచాం .రాబోయే 4 సంవత్సరాలలో లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇండ్లు నిర్మిస్తాం
అర్హులైన పేదలందరికీ రాజకీయాలు, కులాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు మిడ్ మానేరు నిర్వాసితులకు 236 కోట్లతో 4696 ఇండ్ల మంజూరు ధరణి రికార్డుల నిర్వహణను విదేశీ సంస్థ నుంచి ఎన్.ఐ.సి కు అప్పగించాం
త్వరలో దేశానికే ఆదర్శంగా నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తాం