Breaking News

ఏన్కూర్,జూలూరుపాడు ఏఎంసీ మార్కెట్ యార్డ్‌ను పరిశీలించిన డీఎంఓ

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి

జూలూరుపాడు మండలంలో నూతనంగా ఏర్పడిన మార్కెట్ యార్డును ఏఎంసీ డీఎంఓ ఎం.ఎ. అలీమ్ సందర్శించి సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, లావాదేవీల విధానం, నిర్వహణ వ్యవస్థపై సిబ్బంది, వ్యాపారదారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఏన్కూరు మండల మార్కెట్ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులు పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
మార్కెట్ చైర్మన్ లచ్చిరాం నాయక్ ఆధ్వర్యంలో డీఎంఓకు శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో వ్యాపారదారులు, మాజీ ఎంపీటీసీ మేడా ధర్మారావు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి