మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా ప్రతినిధి:
కరీంనగర్ నగరంలోని అల్గునూరు ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ మరమ్మతులు చేస్తుండగా నేడు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడిన మున్సిపల్ లైన్ మెన్ శివకృష్ణను నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగని శ్రీనివాస్ కలిసి సురక్ష ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కరీంనగర్ మాజీ మేయర్,రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్,58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ వెంటనే స్పందించిన సర్దార్ రవీందర్ సింగ్,గాయపడిన లైన్ మెన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని,అతనికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,విధి నిర్వహణలో ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని తెలిపారు.ప్రభుత్వ అధికారులు, సిబ్బంది భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాయపడిన శివకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడిన మున్సిపల్ లైన్ మెన్ శివకృష్ణను పరామర్శించిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్,58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్,గాయపడిన లైన్ మెన్ కు మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్య సిబ్బందిని కోరారు.


