- కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి
- ఉత్సవ కమిటీలతో సమన్వయ సమావేశం
మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
రాబోయే శ్రీరామ నవమి వేడుకలను భక్తిభావంతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులతో ఆయన ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా భద్రతా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ కోసం ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. శబ్ద కాలుష్యం కలగకుండా నిర్ణీత పరిమితుల్లోనే ధ్వని వర్థకాలను (మైక్ సెట్లు) ఉపయోగించాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రతి విషయంలోనూ పోలీస్ శాఖతో సమన్వయం పాటించాలని కోరారు. ప్రజల సహకారంతోనే పండుగలను ప్రశాంతంగా జరుపుకోవడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డితో పాటు ఎస్సైలు సుధాకర్ రెడ్డి, వెంకన్న, సాయిలు, సతీష్, పోలీస్ సిబ్బంది మరియు వివిధ ఆలయాల ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

