మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బొమ్మన వేణి రవి అనే వ్యక్తి ఎల్లారెడ్డిపేట మండలంలోని కరీంనగర్ డైరీ పాల క్యాన్లను ప్రతిరోజు ఉదయం చుట్టుపక్కల గ్రామాలలో తీసుకువస్తుండేవాడు అలా తీసుకొస్తున్న సమయంలో సోమవారం రోజున చుట్టుపక్కల గ్రామాల నుండి సేకరించిన పాల క్యాన్లు ఎల్లారెడ్డిపేట కు ఉదయం 6 గంటల సమయంలో ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ వద్ద బొమ్మన వేణి రవి నడుపుతున్న ఆటో అదుపుతప్పి ప్రమాదవశాత్తు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను గట్టిగా ఢీకొట్టడంతో రవి కింద పడి గాయం అవ్వగా మొదటగా అశ్విని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స గురించి కరీంనగర్ లోని సన్ రైస్ హాస్పిటల్ కి తరలించగా తలకు బలమైన గాయాలు అవడంతో బుధవారం చనిపోయినాడు ఈ సంఘటనపై ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

