మన ప్రగతి న్యూస్ సిరిసిల్ల జిల్లా స్టాపర్ /
రాజన్న సిరిసిల్ల జిల్లా శుక్రవారం రోజున (27 తేదీ) వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా 300 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రాముల వారి కళ్యాణం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రానికి భారీగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని , ఇన్‌చార్జ్ అధికారులు తమ క్రింది సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి,ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఎస్పీ సూచించారు.ఈనెల 28వ తేదీ శనివారం నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్‌లు మరియు ఇతర సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ రాజీ పడదగిన కేసులను గుర్తించాలని సూచించారు.అలాగే, సంబంధిత కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకునేలా ప్రోత్సహిస్తూ రాజీ కుదిరే విధంగా చైతన్యం కల్పించాలని పేర్కొన్నారు.
ఈసమావేశంలో డిఎస్పీ లు నాగేంద్రచారి,శ్రీనివాస్,సి.ఐ లు శ్రీనివాస్, వీరప్రసాద్, మొగిలి,ఎస్.ఐ లు పాల్గోన్నారు

