
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
ఏన్కూరు మండలం గంగుల నాచారం గ్రామంలో ఆదివారం రాత్రి తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారాన్ని అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. విజయ్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు. సమానత్వం, లౌకికత్వం, సామాజిక న్యాయంతో కూడిన కొత్త రాజకీయాలకు విజయ్ శ్రీకారం చుట్టారని కొనియాడారు. సామాన్యులకు ఎమ్మెల్యే అవకాశాలు కల్పించడం, యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విజయ్ కృషి చేయాలని, టీవీకే పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు.
