తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జున సాగర్ నందికొండ హిల్ కాలనీ పట్టణం లోని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాయితి జానకి రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 27 28 తారీకులలో కరీంనగర్ నుండి వేములవాడ వరకు ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించు పాదయాత్రకు నల్లగొండ జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని జానకి రెడ్డి పిలుపునిచ్చారు , తెలంగాణ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఈ పాదయాత్ర లో పాల్గొనాలని ఆమె తెలియజేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని నిజమైన ఉద్యమకారులకు 250 గజాలు ఇంటి స్థలంతో పాటు 25 వేల రూపాయల పెన్షన్ బస్సు పాసు ,ఐదు లక్షల రూపాయలు హెల్త్ కార్డు అన్ని కూడా వెంటనే అమలుపరచాలని స్థానిక విలేకరుల సమావేశంలోతెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు హీరే కార్ రమేష్ జి ,కంచర్ల సుధీర్ కుమార్ , గుజ్జుల కొండలు ,సిరికొండ మధు, పందిళ్ళ సత్యనారాయణ పాక శివ నాగులు సపావత్ చంద్రమౌళి నాయక్ తదితరులు పాల్గొన్నారు.