Breaking News

పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రికల్ బైకులు బాగుఎమ్మెల్యే.మన ప్రగతి న్యూస్/ పిట్లం:

మాయ మాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని మోసం చేసిన దుండగులు

పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రికల్ బైకులు బాగుంటాయని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆయన శుక్రవారం పిట్లం మండల కేంద్రంలోని అక్షయ మోటార్స్ ఎడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్స్ షోరూం ప్రారంభించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే షోరూం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జుక్కల్ నియోజకవర్గం లో నూతన షోరూమ్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని వారికి సూచించారు.
ఈ సంద‌ర్బంగా బ్యాటరీతో నడిచే బైక్‌లను పరిశీలించి
వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంబిగ హనుమాన్లు, జుక్కల్ నియోజకవర్గం ప్రచార కమిటీ అధ్యక్షుడు బొడ్ల రాజు, జుక్కల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇమ్రోస్, విండో చైర్మన్ శపథం రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శివకుమార్, షోరూం యజమాన్యం తదితరులు పాల్గొన్నారు.